ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి

యేసు మెస్సీయా?

Jesus sculpture

యేసు గురించి, ఆయన మన కోసం సిలువపై మరణించి మనలను రక్షించాడనే విషయం గురించి మనం తరచుగా వింటుంటాం. ఆయనను నమ్మేవారెవరైనా నిత్యజీవం పొందుతారు.

మన ప్రాణాలను రక్షించడం – అదే ఎదురుచూడబడిన మెస్సీయా పాత్ర... అయితే యేసు నిజమైన మెస్సీయానా, లేక మనం మరొకరి కోసం ఎదురుచూడాలా?

ఏర్పరచబడినవాని గురించి, అంటే మనందరినీ రక్షించబోయేవాని గురించిన సమాచారంలో ఎక్కువ భాగం మనకు యెషయా ప్రవక్త గ్రంథం నుండి లభిస్తుంది. ఆయన దాదాపు క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో జీవించి ప్రవచించాడు. అంటే సుమారు యేసు పుట్టడానికి 700 సంవత్సరాల ముందు.

1యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది.
2జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది.
3యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది.
4కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు.
5అతని నడుముకు న్యాయం, అతని మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి.
( యెషయా 11:1-5 )

మెస్సీయా దావీదు రాజు వంశస్థుడై ఉంటాడని మనం ఆశిస్తాం…

1ఇదిగో ఈయనే నేను ప్రోత్సహించే నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నా ప్రాణప్రియుడు.
ఆయనలో నా ఆత్మను ఉంచాను. ఆయన ఈ లోక రాజ్యాలపై తన న్యాయాన్ని నెలకొల్పుతాడు.
2ఆయన కేకలు వేయడు, అరవడు. ఆయన స్వరం వీధుల్లో వినబడదు.
3నలిగిన రెల్లును ఆయన విరవడు. రెపరెపలాడుతున్న వత్తిని ఆర్పడు.
ఆయన న్యాయాన్ని నమ్మకంగా అమలుచేస్తాడు.
4భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకూ ఆయన అలసిపోడు, నిరాశ చెందడు.
సముద్ర ద్వీపాలు అతని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తాయి.
5ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి,
దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,
6“గుడ్డివారి కళ్ళు తెరవడానికీ బందీలను చెరలో నుండి బయటికి తేవడానికీ చీకటి గుహల్లో నివసించే వారిని వెలుగులోకి తేవడానికీ ఆయన వస్తాడు.
7యెహోవా అనే నేనే నీతి గురించి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను.
నిన్ను నిలబెట్టి ప్రజలకు ఒక నిబంధనగా యూదేతర జాతులకు వెలుగుగా నియమించాను.
( యెషయా 42:1-7 )

ఇక్కడ “సేవకుడు” దీనుడై ఉంటాడని, బహిరంగంగా తన స్వరం ఎత్తడని, గ్రుడ్డివారి కళ్లు తెరుస్తాడని మనం చూస్తాం…

యెషయా తన గ్రంథంలో ఆయన గురించి ఇంకా ఏమి చెబుతున్నాడు? ఇతర ప్రజలు మెస్సీయాతో ఎలా ప్రవర్తిస్తారు? ఆయనకు ఏమి జరిగింది, మనకు దాని అర్థం ఏమిటి? దీనికి జవాబివ్వడానికి యెషయా భవిష్యత్తులోకి ముందుకు వెళ్లి, మనం ఇప్పటికే తిరస్కరించిన మెస్సీయా గురించి నేరుగా మనతో మాట్లాడుతున్నాడు.

1మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది?
2ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు.
అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు.
3ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు.
మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు.
4అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు.
అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.
5కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది.
మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.
6మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము.
యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.
7ఆయన దుర్మార్గానికి గురి అయ్యాడు. బాధల పాలైనా అతడు నోరు తెరవలేదు.
గొర్రెపిల్లలాగా ఆయన్ని వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు.
8అన్యాయపు తీర్పుతో ఆయన్ని శిక్షించారు. ఆ తరంలో ఆయన గురించి ఎవరు పట్టించుకున్నారు?
నా ప్రజల దుర్మార్గానికి ఆయనకు శిక్ష పడింది. సజీవుల భూమిలోనుంచి అతడు హతమయ్యాడు.
9అతడు చనిపోయినప్పుడు నేరస్థులతో అతన్ని సమాధి చేశారు. ధనవంతుని దగ్గర అతన్ని ఉంచారు.
అతడు ఏ నేరమూ చేయలేదు. అతని నోట మోసం ఎప్పుడూ లేదు.
10అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు.
ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు.
ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది.
11తన వేదన వలన కలిగిన ఫలితం చూసి ఆయన సంతృప్తి పొందుతాడు.
నీతిమంతుడైన నా సేవకుడు అనేకమంది దోషాలను భరించి తన జ్ఞానంతో వారిని నిర్దోషులుగా ఎంచుతాడు.
12కాబట్టి గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెడతాను. అనేకమందితో కలిసి అతడు కొల్లసొమ్ము పంచుకుంటాడు.
ఎందుకంటే ఆయన తన ప్రాణం ధారపోసి చనిపోయాడు. అక్రమకారుల్లో ఒకడిగా ఆయన్ని ఎంచడం జరిగింది.
ఆయన చాలామంది పాపాన్ని భరిస్తూ అపరాధుల కోసం విజ్ఞాపన చేశాడు.
( యెషయా 53:1-12 )

తిరస్కరించబడిన, తృణీకరించబడిన మెస్సీయా వధించబడిన గొర్రెపిల్లవలె మన పాపాల కోసం మరణించడం మనం చూస్తాం. ఆయన సంతానం లేకుండా మరణించాడు, అయినా ఆయన “దీర్ఘాయుష్మంతుడవుతాడు”, “అనేకమంది సంతానాన్ని కలిగి ఉంటాడు”. దీని అర్థం బహుశా మెస్సీయా తన మరణం తర్వాత భూమిపైనైనా పరలోకంలోనైనా పునరుత్థానం చెంది, శారీరకమైన లేదా ఆత్మీయమైన పిల్లలను కలిగి ఉంటాడని.

ఇప్పుడు మీ కోసం ఒక అభ్యాసంగా, యేసు ఎదురుచూడబడిన మెస్సీయానో కాదో నిర్ణయించుకోవడానికి, యేసుక్రీస్తు గురించి మత్తయి, మార్కు, యోహాను ఇచ్చిన సాక్ష్యాలను చదవండి – వీరు తమ జీవితాల్లో చాలా కాలం యేసుతో స్వయంగా గడిపారు – అలాగే నజరేయుడైన యేసుక్రీస్తు జీవితం గురించిన వాస్తవాలను శ్రద్ధగా సేకరించిన వైద్యుడైన లూకా సాక్ష్యాన్ని కూడా చదవండి…

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTel)